US Military Plane Crash: అమెరికాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన B-52 బాంబర్ యుద్ధ విమానం, 8 మంది మృతి!
US Military Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన B-52 బాంబర్ విమానం కుప్పకూలింది.
US Military Plane Crash: అమెరికాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన B-52 బాంబర్ యుద్ధ విమానం, 8 మంది మృతి!
US Military Plane Crash: అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణ కాలిఫోర్నియాలోని ప్రముఖ సైనిక స్థావరం 'ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్' (Edwards Air Force Base) లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన B-52 బాంబర్ యుద్ధ విమానం రన్‌వే పైనుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎనిమిది మంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. విమానం భూమిని ఢీకొట్టిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో అమెరికా మిలటరీ సిబ్బందితో పాటు కొందరు ప్రభుత్వ రక్షణ శాఖ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్స్, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గురైన B-52 బాంబర్ విమానానికి అమెరికా మిలటరీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1950 వ సంవత్సరం నుంచి ఈ భారీ బాంబర్ విమానాలు అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో కీలక సేవలు అందిస్తున్నాయి. వ్యూహాత్మకంగా శత్రుదేశాలపై భారీగా బాంబుల వర్షం కురిపించేందుకు దీనిని వినియోగిస్తుంటారు. అంతటి నమ్మకమైన ట్రాక్ రికార్డ్ ఉన్న యుద్ధ విమానం ఇలా టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోవడంపై అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.




