Donald Trump: మరో షాకిచ్చేందుకు ట్రంప్ రెడీ.. రష్యా చమురు కొంటే భారీ సుంకాలు

Donald Trump: అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రష్యా, ఇరాన్‌లపై కఠిన ఆంక్షలు విధించే శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది.

CR Reddy
Published on: 17 Sept 2026 6:55 AM IST
Donald Trump
X

Donald Trump

Donald Trump: అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రష్యా, ఇరాన్‌లపై కఠిన ఆంక్షలు విధించే శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అపారమైన అధికారాలు లభించాయి. రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే అగ్రగామి దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకం విధించే అధికారం ఇప్పుడు ట్రంప్‌కు దక్కింది. ఈ జాబితాలో భారతదేశంతో పాటు చైనా, స్లొవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ వంటి దేశాలు కూడా ఉండే అవకాశం ఉంది.

భారత్‌కు పెరగనున్న టెన్షన్

ఈ బిల్లు సెనేట్‌లో ఇప్పటికే ఆమోదం పొందగా, ఇప్పుడు కేవలం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం మాత్రమే మిగిలి ఉంది. ఇది చట్టరూపం దాల్చితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లు ట్రంప్‌ను కచ్చితంగా టారీఫ్ లు విధించాలని ఎక్కడా బలవంతం చేయడం లేదు. కేవలం ఆయనకు ఆ విచక్షణాధికారాన్ని మాత్రమే కల్పిస్తోంది. అంతేకాకుండా రష్యాతో ఇంధన దిగుమతులను ఇప్పటికే తగ్గించుకున్న యూరప్ దేశాలకు ఈ నిబంధనల నుంచి కొన్ని మినహాయింపులు కూడా లభించే అవకాశం ఉంది.

రాజకీయ నాటకం మధ్య ఊహించని మలుపు

మొదట్లో ఈ బిల్లు పాస్ కావడం కష్టంగానే కనిపిచింది. ఎన్నికల ముందస్తు రాజకీయాల కారణంగా రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల మధ్య దీనిపై తీవ్ర వాగ్వాదాలు నడిచాయి. కానీ, అనూహ్యంగా సోమవారం జరిగిన పరిణామాల్లో సభా నిబంధనల అడ్డంకులు తొలగిపోవడంతో ఈ బిల్లు ముందుకు కదిలింది. హౌస్‌లో జరిగిన ఓటింగ్‌లో కొద్దిమంది డెమోక్రాటిక్ సభ్యులు కూడా రిపబ్లికన్లకు మద్దతుగా ఓటు వేయడంతో ఈ బిల్లు సులభంగా నెగ్గింది. పుతిన్ ప్రభుత్వానికి ఇది అమెరికా నుంచి గట్టి హెచ్చరిక అని సెనేటర్ జీన్ షాహీన్ పేర్కొన్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.