Donald Trump: నేను గొప్పలు చెప్పడం లేదు.. 8 యుద్ధాలు ఆపాను, నోబెల్ నాకే రావాలి
Nobel Peace Prize: తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తాను పూర్తిగా అర్హుడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.
Donald Trump: నేను గొప్పలు చెప్పడం లేదు.. 8 యుద్ధాలు ఆపాను, నోబెల్ నాకే రావాలి
Nobel Peace Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోబెల్ ఆకాంక్షను బహిరంగంగా వ్యక్తపరిచారు. తాను ఎలాంటి గొప్పలు చెప్పడం లేదని, కేవలం వాస్తవాలే మాట్లాడుతున్నానని చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఎనిమిది యుద్ధాలను ఆపానని ఆయన మరోసారి చెప్పుకొచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ, ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇంకెవరూ చేయలేని గొప్ప పనులు తాను చేశానని, ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇన్ని యుద్ధాలకు పరిష్కారం చూపించి ఉండకపోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. తాను నోబెల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హుడినని స్పష్టం చేశారు.
ఈ పురస్కారం తనకు వస్తుందనే నమ్మకం మాత్రం చాలా తక్కువేనని, నాలాంటి వారికి ఈ అవార్డు ఇవ్వకపోవడమే నార్వేజియన్ నోబెల్ కమిటీకి అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.
2026 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 9న ప్రకటించనున్నారు. గతేడాది కూడా ట్రంప్ ఈ అవార్డుపై ఆశలు పెట్టుకున్నప్పటికీ వెనెజువెలా విపక్ష నేతకు దక్కడంతో నిరాశ ఎదురైంది. ఈసారైనా ట్రంప్‌ను ఈ పురస్కారం వరిస్తుందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.




