Donald Trump : 79 ఏళ్ల వయసులో 65 ఏళ్ల నాటి ఎనర్జీ.. లీకైన ట్రంప్ మెడికల్ రిపోర్ట్‌తో వణుకుతున్న ప్రత్యర్థులు

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లీకైన మెడికల్ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. 79 ఏళ్ల వయసున్న ఆయన గుండె, 14 ఏళ్లు చిన్నదైన 65 ఏళ్ల వ్యక్తిలా ఎంతో ఆరోగ్యంగా ఉందని వైట్ హౌస్ తెలిపింది.

CR Reddy
Published on: 1 Jun 2026 9:28 AM IST
Donald Trump
X

Donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలు, దూకుడు నిర్ణయాలతోనే కాకుండా తన ఫిట్‌నెస్‌తోనూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వైట్ హౌస్ విడుదల చేసిన ఆయన మెడికల్ రిపోర్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నివేదిక చూసిన ట్రంప్ రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 79 ఏళ్ల వయసున్న ట్రంప్ గుండె, ఒక 65 ఏళ్ల వ్యక్తి గుండెలా ఎంతో యంగ్‌గా పనిచేస్తోందని ఈ రిపోర్ట్ తేల్చింది. వైట్ హౌస్ విడుదల చేసిన మూడు పేజీల అధికారిక మెడికల్ డాక్యుమెంట్‌లో ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అందులో "డోనాల్డ్ ట్రంప్ కార్డియాక్ ఏజ్ ఆయన అసలు వయసు కంటే 14 ఏళ్లు తక్కువ" అని రాసి ఉంది. జూన్ 14తో ట్రంప్ 80వ పడిలోకి అడుగుపెడుతున్నప్పటికీ, ఆయన హార్ట్ ఫంక్షన్ మాత్రం ఇంకా 65 ఏళ్ల యువకుడిలాగే ఎంతో బలంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

22 మంది నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు

ఈ హెల్త్ రిపోర్ట్ కేవలం పబ్లిక్ ఇమేజ్ కోసం క్రియేట్ చేసింది కాదు. ఏకంగా 22 మంది లీడింగ్ మెడికల్ ఎక్స్‌పర్ట్స్ పర్యవేక్షణలో ట్రంప్‌కు అనేక రకాల అధునాతన పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాతే వైట్ హౌస్ డాక్టర్ షాన్ బార్బాబెల్లా మాట్లాడుతూ.. ట్రంప్ మెదడు అత్యంత చురుగ్గా ఉందని, ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయని, మానసిక స్థితి పూర్తిగా నార్మల్‌గా ఉందని ప్రకటించారు. దేశ అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు నిర్వహించడానికి ఆయన వంద శాతం ఫిట్‌గా ఉన్నారని తేల్చారు.

ప్రెజర్ కుక్కర్ లాంటి జాబ్.. అయినా తగ్గని జోష్

అమెరికా ప్రెసిడెంట్ పదవి అంటే ప్రపంచంలోనే అత్యంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. యుద్ధాలు, గ్లోబల్ పాలిటిక్స్, అంతర్గత సమస్యలతో నిత్యం సిట్యువేషన్ రూమ్‌లోనే గడపాల్సి ఉంటుంది. ఇంతటి మానసిక ఒత్తిడి, కోర్టు కేసులు, మీడియా అటాక్స్ ఉన్నప్పటికీ ట్రంప్ ఎనర్జీ లెవెల్స్ చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సుదీర్ఘ ర్యాలీలు చేయడం, వేదికలపై డ్యాన్స్ చేయడం, అర్ధరాత్రి వరకు మీటింగ్‌లు పెట్టి మళ్లీ తెల్లవారుజామునే గోల్ఫ్ ఆడటానికి వెళ్లడం ట్రంప్‌కే చెల్లిందని అభిమానులు అంటున్నారు.

అసలు కార్డియాక్ ఏజ్ అంటే ఏంటి?

కార్డియాక్ ఏజ్ అనేది ఒక మనిషి బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, హార్ట్ ఫంక్షన్, బయోలాజికల్ మార్కర్ల ఆధారంగా లెక్కించే గుండె వయసు. ఒక వ్యక్తికి ధూమపానం, మద్యపానం అలవాట్లు లేకుంటే వారి గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. ట్రంప్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయనకు సిగరెట్, మద్యం తాగే అలవాటు అస్సలు లేదు. ఇదే ఆయన గుండెను 14 ఏళ్లు యంగ్‌గా ఉంచడానికి ప్రధాన కారణమని వైద్యులు తేల్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story