Donald Trump: ట్రంప్ దూకుడుకు బ్రేక్.. యూఎస్ సెనేట్ సంచలన తీర్మానం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ సెనేట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Arun Chilukuri
Updated on: 24 Jun 2026 11:39 AM IST
Donald Trump
X

Donald Trump: ట్రంప్ దూకుడుకు బ్రేక్.. యూఎస్ సెనేట్ సంచలన తీర్మానం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‎కు బిగ్‎షాక్ తగిలింది. ఇరాన్ పై సైనిక చర్యలు ఆపాలని ట్రంప్‎ను యూఎస్ సెనెట్ ఆదేశించింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్ తో ఘర్షణలకు దిగకుండా అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు.

సెనేట్‎లో ట్రంప్‎కు చెందిన రిపబ్లికన్ పార్టీకే మెజార్టీ ఉన్నప్పటికీ .. నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ లైన్ దాటి ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇప్పటికే ఈ బిల్లు దిగువ సభలో నెగ్గగా.. ఇప్పుడు సెనేట్ కూడా ఆమోదించడంతో కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఇరాన్ పై ఏకపక్షంగా సైనిక దాడులను కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం అయ్యింది. ఇరాన్‎తో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలు ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story