US War Powers Law Loophole: ఇది వార్‌ చట్టం కాదు...ప్రపంచం పాలిట పెనుభూతం

అమెరికా రాజ్యాంగంలో సొంత దేశంపై దాడి జరిగితే...యుద్ధం చేయాలని నిర్ణయించుకునే అవకాశం దేశాధ్యక్షుడికి ఉంటుంది. కానీ, వేరే దేశంపై యుద్ధం చేయాలి అంటే తప్పనిసరిగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని యుద్ధ అధికారాల చట్టంలో పేర్కొనబడింది.

Balachander
Published on: 1 May 2026 10:56 AM IST
US War Powers Law Loophole: ఇది వార్‌ చట్టం కాదు...ప్రపంచం పాలిట పెనుభూతం
X

US War Powers Law Loophole: అమెరికా రాజ్యాంగంలో సొంత దేశంపై దాడి జరిగితే...యుద్ధం చేయాలని నిర్ణయించుకునే అవకాశం దేశాధ్యక్షుడికి ఉంటుంది. కానీ, వేరే దేశంపై యుద్ధం చేయాలి అంటే తప్పనిసరిగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని యుద్ధ అధికారాల చట్టంలో పేర్కొనబడింది. దీనిపై అమెరికా రాజ్యంగ నిపుణుడు బ్రూస్‌ ఫీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్‌ పవర్స్‌ రిజల్యూషన్‌లోని లొసుగులను వాడుకొని అమెరికా అధ్యక్షులు తమకు నచ్చినట్టు యుద్ధ సమయాన్ని పెంచుకోవచ్చని అన్నారు. మరి ఇందులో ఉన్న లొసుగులు ఏంటి? ఎలా ఉపయోగించుకుంటున్నారు?

వార్ పవర్స్ చట్టం - అమెరికా అధ్యక్షుడికి లొసుగుల 'వరం'

అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్ (పార్లమెంట్) కు మాత్రమే ఉంటుంది. కానీ, 1973లో వచ్చిన వార్ పవర్స్ రిజల్యూషన్ ప్రకారం, అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండానే 60 రోజుల పాటు యుద్ధం చేసే వెసులుబాటు ఉంది. అయితే, ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం విషయంలో ఈ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందో మాజీ డిప్యూటీ అటార్నీ జనరల్ బ్రూస్ ఫీన్ విశ్లేషించారు.

వార్‌ రీసెట్‌ బటన్‌

బ్రూస్‌ ఫీన్‌ అభిప్రాయం ప్రకారం, చట్టంలో యుద్ధం ఎప్పుడు మొదలైంది...ఎప్పుడు ఆగిందనే విషయంలో స్పష్టత లేదు. దీనినే రీసెట్‌ బటన్‌ అంటారు. దీని అర్థమేమంటే... ఉదాహరణకు యుద్ధం చేస్తున్న దేశంపై వరుసగా 40 నిమిషాలపాటు బాంబులు వేయలేదు కాబట్టి యుద్ధం అక్కడితో ముగిసిందని ప్రకటించి...కాసేపటి తరువాత మళ్లీ దాడులు మొదలుపెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే... సైనిక చర్యను చేపట్టడానికి 60 రోజుల గడువు ఉంటుంది. ఈ 60 రోజుల్లో సైనిక చర్యలను చేపట్టి...యుగిసిందని ప్రకటించి మళ్లీ సైనిక చర్యలు చేపట్టవచ్చు. అంటే ఆగి ఆగి యుద్ధం చేయవచ్చు. చట్టంలోని లొసుగుల ప్రకారం సాంకేతికంగా కాంగ్రెస్‌ అనుమతి అవసరం లేకుండానే యుద్ధాన్ని నిరంతరం కొనసాగించవచ్చు.

రాజ్యాంగ విరుద్ధమైన యుద్ధం?

ఇరాన్ అమెరికాపై ఎప్పుడూ దాడి చేయలేదని, అందువల్ల ఈ యుద్ధం "నేరపూరిత దురాక్రమణ" కిందకే వస్తుందని ఫీన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం దేశంపై దాడి జరిగితే తప్ప, శాంతి నుంచి యుద్ధానికి వెళ్లే నిర్ణయం అధ్యక్షుడు ఒక్కడే తీసుకోలేడు. 1973లో ఈ చట్టం తయారైనప్పుడు తాను అక్కడే ఉన్నానని గుర్తు చేసుకున్న ఆయన, ఈ చట్టం ఎంతో అస్పష్టంగా ఉందని విమర్శించారు.

అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఒక ఆటలో నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, అవుట్ అవ్వకుండా ఆడుతున్న చదరంగం లాంటిది. అమెరికా అధ్యక్షులు ఈ లొసుగులను వాడుకుని యుద్ధాలను శాసిస్తున్నారని ఫీన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్‌ దీనిని తనకు అనుకూలంగా వాడుకొని పదేపదే యుద్ధానికి దిగితే వార్‌ పవర్‌ రిజల్యూషన్‌ ప్రపంచం పాలిట పెనుభూతంగా మారుతుందనడంలో సందేహం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story