Viral News: మొగుడు కావాలంటూ జాబ్ అప్లికేషన్ తరహాలో ప్రకటన.. 240 దరఖాస్తులు పంపిన యువకులు!
Viral News: డేటింగ్ యాప్స్‌తో విసిగిపోయిన అమెరికా యువతి ఎరిన్ పాటర్సన్.. గూగుల్ ఫామ్ ద్వారా జాబ్ అప్లికేషన్ తరహాలో భర్త కావాలని కోరింది.
Viral News: మొగుడు కావాలంటూ జాబ్ అప్లికేషన్ తరహాలో ప్రకటన.. 240 దరఖాస్తులు పంపిన యువకులు!
Viral News: అందరిలాగే ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏముంది వెరైటీ అనుకుందో ఏమో గానీ.. అమెరికాకు చెందిన ఒక యువతి మాత్రం ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఏకంగా ఉద్యోగ ఖాళీల (Job Openings) తరహాలో ఆన్‌లైన్‌లో ‘మొగుడు కావాలి’ అంటూ ఓ దరఖాస్తు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది.
‘న్యూయార్క్ పోస్ట్’ కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన ఎరిన్ పాటర్సన్ అనే యువతి అప్పటికే వివిధ డేటింగ్ యాప్స్ ద్వారా సరైన జోడీ కోసం వెతికి విసిగిపోయింది. డేటింగ్ యాప్స్‌లో కాలం వృథా అవుతుందని భావించిన ఆమె.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఓ వినూత్నమైన గూగుల్ ఫామ్‌ను రూపొందించింది.
‘‘నేను ఒక అందమైన, తెలివైన, సహృదయం గల, కాఫీ లేదా డిన్నర్ చేస్తూ మంచి సంభాషణలు ఆస్వాదించే వ్యక్తి కోసం చూస్తున్నా’’ అని ఆ ఫామ్‌లో ఎరిన్ పేర్కొంది.
ఈ గూగుల్ ఫామ్‌లో దరఖాస్తుదారులు తమ వృత్తిపరమైన సంబంధాలు, కెరీర్ లక్ష్యాలు, సంబంధాల పట్ల వారి అంచనాలకు సంబంధించిన పలు ప్రశ్నలను ఉంచింది. అంతేకాకుండా, దరఖాస్తుదారుడి రోజువారీ దినచర్య, వ్యాయామ విధానాలు, పెళ్లి మరియు కుటుంబంపై వారి అభిప్రాయాలను తెలుసుకునేలా విభిన్నమైన ప్రశ్నలను చేర్చింది.
ఉద్యోగ దరఖాస్తు మాదిరిగా ఆమె పెట్టిన ఈ వినూత్న ప్రకటనకు సోషల్ మీడియాలో ఊహించని స్పందన వచ్చింది. ఆమెను పెళ్లాడేందుకు యువకులు క్యూ కట్టారు. ఇప్పటివరకు ఈ గూగుల్ ఫామ్ ద్వారా ఏకంగా 240 దరఖాస్తులు రావడం విశేషం. భాగస్వామిని ఎంచుకోవడంలో ఆమె అవలంబించిన ఈ ట్రెండీ, వినూత్న ఆలోచన చాలా బాగుందంటూ నెటిజన్లు ఆమెను తెగ ప్రశంసిస్తున్నారు.




