USA: గర్భిణుల వీసా రద్దు చేసిన అమెరికా.. అసలు కారణం ఏంటో తెలుసా.?
USA: అమెరికా ప్రభుత్వం బర్త్ టూరిజంపై కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాలో బిడ్డకు జన్మనిస్తే అక్కడి పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో వచ్చే విదేశీయులపై చర్యలు వేగవంతం చేసింది.
USA: గర్భిణుల వీసా రద్దు చేసిన అమెరికా.. అసలు కారణం ఏంటో తెలుసా.?
USA: ఈ క్రమంలో జూలై నెలలోనే దాదాపు 600 మంది గర్భిణుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వెల్లడించారు. 9వ నెలలో అమెరికాకు వచ్చిన గర్భిణులపై చర్య
మార్కో రుబియో తెలిపిన వివరాల ప్రకారం, వీసాలు రద్దైన మహిళలు ఎక్కువగా గర్భధారణ 9వ నెలలో అమెరికాకు చేరుకున్నవారే. వీరు అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, అక్కడి పౌరసత్వం పొందే ఉద్దేశంతో వచ్చినట్లు అధికారులు అనుమానించారు. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్ టూరిజం టాస్క్ ఫోర్స్ వారి వీసాలను సమీక్షించి రద్దు చేసింది.
వీసా నిబంధనల ఉల్లంఘనలపై ఫోకస్
అమెరికాలో వీసా నిబంధనలను దుర్వినియోగం చేసే వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ వలసలను నియంత్రించడం, వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడం లక్ష్యంగా తనిఖీలు మరింత పెంచింది. ప్రయాణ ఉద్దేశాలపై అనుమానాలు ఉన్న దరఖాస్తుదారులను అధికారులు ఇప్పుడు మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు.
అంతర్జాతీయ విద్యార్థులపై కూడా ప్రభావం
కొత్త వీసా నిబంధనల ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై కూడా కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫాల్ సీజన్లో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 1.12 లక్షలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజా చర్యలతో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే వారి ప్రయాణ ఉద్దేశాలు, సమర్పించే పత్రాలు, ఇతర వివరాలపై ఇమ్మిగ్రేషన్ అధికారులు మరింత కఠినంగా పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




