USA: అమెరికాలో సోనం వాంగ్‌చుక్‌కు మ‌ద్ధ‌తు.. న్యూయార్క్‌లో నిరసనలు

USA: నీట్ అక్రమాలపై దీక్ష చేస్తున్న సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా న్యూయార్క్, లండన్, డబ్లిన్‌లలో నిరసనలు.

Mokshith
Published on: 22 July 2026 11:27 AM IST
USA
X

USA: అమెరికాలో సోనం వాంగ్‌చుక్‌కు మ‌ద్ధ‌తు.. న్యూయార్క్‌లో నిరసనలు

USA: ఎన్‌ఈఈటీ (NEET) పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్, శాన్‌జోసే నగరాల్లో నిరసనలు జరిగాయి.

అమెరికాకు చెందిన 'హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్' సంస్థ ఆధ్వర్యంలో కార్యకర్తలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

లండన్, డబ్లిన్‌లోనూ ఆందోళనలు

అమెరికాతో పాటు బ్రిటన్‌లోని లండన్‌లో భారత హైకమిషన్ ఎదుట, ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో భారత రాయబార కార్యాలయం ఎదుట కూడా ఇదే తరహా నిరసనలు నిర్వహించినట్లు 'హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్' తెలిపింది. భారత విద్యార్థులకు న్యాయం జరగాలని, వారికి నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం స్పందించాలని సంస్థ పేర్కొంది. విద్యార్థులకు పారదర్శకమైన వ్యవస్థ, నిజాయితీతో కూడిన సమాధానాలు అందాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం బాధ్యత వహించి సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

క్షీణిస్తున్న ఆరోగ్యం

ఇదిలా ఉంటే ఎన్‌ఈఈటీ పరీక్షలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోనం వాంగ్‌చుక్ మూడు వారాలకు పైగా నిరాహార దీక్ష కొనసాగించిన విష‌యం తెలిసిందే. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి మార్చారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story