USA: ఉచిత విమాన టికెట్, రూ. 2.5 లక్షల డబ్బు.. సరికొత్త ఆఫర్ ప్రకటించిన ట్రంప్
USA: అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అధికారికంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించే క్రమంలో ఓ ప్రకటన చేశారు.
USA: ఉచిత విమాన టికెట్, రూ. 2.5 లక్షల డబ్బు.. సరికొత్త ఆఫర్ ప్రకటించిన ట్రంప్
USA: అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అధికారికంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించే క్రమంలో ఓ ప్రకటన చేశారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల కోసం కొత్త విధానం అమల్లోకి వచ్చింది. యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రకటించిన ఈ స్కీమ్ ప్రకారం, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నవారు స్వచ్ఛందంగా తమ దేశానికి తిరిగి వెళితే వారికి ఉచిత విమాన టికెట్‌తో పాటు నగదు బోనస్ కూడా ఇస్తామని తెలిపింది. ఈ ప్రకటనలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని తాజ్ మహల్ ఫోటోను ఉపయోగించడం విశేషం.
స్వచ్ఛందంగా వెళ్లేవారికి ప్రత్యేక ప్రయోజనాలు
ఈ స్కీమ్‌లో భాగంగా స్వదేశానికి తిరిగి వెళ్లే వారికి సుమారు 2,600 డాలర్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. అంతేకాకుండా ఉచితంగా విమాన ప్రయాణం కూడా కల్పిస్తారు. ముఖ్యంగా, ఇలా స్వచ్ఛందంగా వెళ్లేవారికి లీగల్ సమస్యలు తక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో అరెస్ట్ లేదా బలవంతపు డిపోర్టేషన్ వంటి సమస్యలను తప్పించుకోవచ్చు.
CBP యాప్ ద్వారా నమోదు ఎలా?
ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే వారు CBP హోమ్ యాప్ అనే మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా వారు తమ వివరాలను నమోదు చేసి, స్వచ్ఛందంగా వెళ్లాలనుకుంటే తెలియజేయవచ్చు. అలాగే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా ఈ ప్రక్రియ ద్వారా పొందవచ్చు. దేశం విడిచిన తర్వాత దానికి సంబంధించిన నిర్ధారణ వివరాలు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ హోమ్ కమింగ్
ఈ స్కీమ్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అనే పెద్ద ప్రణాళికలో భాగంగా అమలు అవుతోంది. మొత్తం 200 మిలియన్ డాలర్లతో స్టే అవుట్ అండ్ లీవ్ నౌ అనే ప్రచారం చేపట్టారు. దీని లక్ష్యం అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేలా ప్రోత్సహించడం. ఈ విధానం ద్వారా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ సమస్యను నియంత్రించాలనుకుంటోంది.
కఠిన చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి
క్రిస్టీ నియోమ్ వెల్లడించిన ప్రకారం, గత 200 రోజుల్లో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అలాగే ICE, CBP సంస్థలు అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి పంపించే చర్యలను వేగవంతం చేశాయి. స్వచ్ఛందంగా వెళ్లకపోతే అరెస్ట్ చేసి బలవంతంగా డిపోర్ట్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.




