West Asia War: యుద్ధ విరామానికి నో చెప్పిన ఇరాన్‌... అమెరికా ఎఫ్‌ 15 జెట్‌ కూల్చివేతతో పెరిగిన ఉద్రిక్తతలు

West Asia War: పశ్చిమ ఆసియాలో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే సైనిక చర్యలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, 48 గంటల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ అధికారికంగా తిరస్కరించడం ఉద్రిక్తతలకు కొత్త మలుపు తీసుకొచ్చింది.

Balachander
Published on: 4 April 2026 9:33 AM IST
Iran Rejects Ceasefire
X

Iran Rejects Ceasefire

West Asia War: పశ్చిమ ఆసియాలో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే సైనిక చర్యలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, 48 గంటల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ అధికారికంగా తిరస్కరించడం ఉద్రిక్తతలకు కొత్త మలుపు తీసుకొచ్చింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధవిమానం ఇరాన్ భూభాగంలో కూల్చివేయబడిన ఘటన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.

నో చెప్పిన ఇరాన్‌

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ అల్‌ జజెరా వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్‌ అంగీకరించలేదు. ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇరాన్‌ గగనతలంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్‌ 15 ఈ స్ట్రైక్‌ ఈగిల్‌ యుద్ధవిమానానానన్ని ఇరాన్‌ కూల్చివేసింది. గగనతలంతో పాటు, భూమిపై లక్ష్యాలను కూడా ఈ యుద్ధవిమానం దాడి చేస్తుంది. ఇందులో ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఒకరు పైలట్‌కాగా, రెండోవ్యక్తి ఆయుధ వ్యవస్థల నిపుణుడు.

పైలట్ల కోసం గాలింపు

ఈ ఘటన తరువాత అమెరికా సైన్యం వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించింది. కూలిపోయిన విమానంలోని ఇద్దరు సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే, సిబ్బందిలో ఒకరిని సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం అతను అమెరికా అదుపులో వైద్య చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం. రెండో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీఎన్ఎన్‌ నివేదికల ప్రకారం, యుద్ధ విమానం ఇరాన్‌లోని ఖుజెస్థాన్‌ ప్రావిన్స్‌ పరిధిలోని కరూన్‌ నది సమీపంలో గుర్తించారు. ఇది టెహ్రాన్‌ను దక్షిణంగా 470 కిలోమీటర్ల పరిధిలో ఉన్నది. ఇక్కడి నుంచి వచ్చిన వీడియోల ప్రకారం తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాఫ్టర్లు కనిపించారు. సాధారణంగా ఇంత ఎత్తులో విమానాలు ప్రయాణిస్తున్నాయి అంటే గాలింపు లేదా రిఫ్యూయిలింగ్‌ కోసమే ఇలా చేస్తాయి.

ఎఫ్‌ 15 జెట్‌ కూల్చివేత దృవీకరణ

ప్రముఖ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్‌ జర్నల్ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎఫ్‌ 15 జెట్‌ ఘటనను దృవీకరించాయి. ఇరాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీ కూడా జెట్‌ లక్ష్యంగా చేసుకొని కూల్చివేశామని ప్రకటించింది. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని మ్యాప్‌ ద్వారా కూడా చూపించింది. ఇప్పటికే అమెరికా ఇరాన్‌ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానం ఇరాన్‌లో కూలిపోవడంతో ఈ ఘర్షణలు మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికా యుద్ధవిమానం ఇరాన్‌లో కూల్చివేయబడటం ఇదే తొలిసారి. అయితే, ఈ ఘటనపై అమెరికా అధికారిక కార్యాలయం వైట్‌హౌస్‌గాని, సైన్యం గాని ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఇరాన్‌ మీడియా మాత్రం రెండో పైలట్‌ పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియదని చెబుతోంది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. కాల్పుల విరమణను నిరాకరించడం, యుద్ధ విమానం కూల్చివేత కలిసి పరిస్థితులను మరింత సున్నితంగా మార్చేశాయి. ఈ ఘర్షణ ఏదిశగా మలుపు తిరుగుతుందో అన్నదే ఇప్పుడు ప్రపంచం అంతా ఉత్కంఠగా గమనిస్తున్న అంశంగా మారింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story