Hormuz: హార్మూజ్ జలసంధి రీ-ఓపెన్.. ప్రపంచ దేశాలకు భారీ ఊరట

US Iran ceasefire: అమెరికా, ఇరాన్ మధ్య 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

Naresh.k
Updated on: 8 April 2026 8:06 AM IST
Hormuz
X

Hormuz: హార్మూజ్ జలసంధి రీ-ఓపెన్.. ప్రపంచ దేశాలకు భారీ ఊరట

US Iran ceasefire: ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో మధ్యప్రాచ్యంలో భారీ ఊరట లభించింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతానికి సద్దుమణిగాయి. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.

హార్మూజ్ జలసంధిపై కీలక నిర్ణయం

రానున్న రెండు వారాల పాటు ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వెల్లడించారు. సాంకేతిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ఇరాన్ ఆర్మీ సమన్వయంతో ఈ 14 రోజుల పాటు రవాణా సాఫీగా సాగేలా చర్యలు తీసుకోనున్నారు.

ట్రంప్ రియాక్షన్..

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు. పాకిస్తాన్ చేసిన ప్రత్యేక వినతిని పరిగణలోకి తీసుకుంటూ, కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఫార్ములాపై చర్చించేందుకు అమెరికా సుముఖంగా ఉండటం ఈ సంక్షోభంలో అతిపెద్ద మలుపుగా పరిగణించవచ్చు.

ఇరాన్ షరతులు ఇవే

అమెరికా, ఇజ్రాయెల్ మాపై దాడులు నిలిపివేస్తే, మా సైన్యం కూడా దాడులను నిలిపివేస్తుంది అని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ 14 రోజుల విరామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు ధరల స్థిరీకరణకు ఎంతో ఊరటనివ్వనుంది.

Naresh.k

Naresh.k

Next Story