Working Days: వారానికి 4 రోజులే ప‌ని దినాలు.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న అక్క‌డి ప్ర‌భుత్వం

Working Days: మ‌ధ్య‌ప్రాచ్యంలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ ప్ర‌భావం ప్ర‌పంచంపై స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీలంక దేశం ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది.

Mokshith
Updated on: 17 March 2026 11:20 AM IST
Working Days: వారానికి 4 రోజులే ప‌ని దినాలు.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న అక్క‌డి ప్ర‌భుత్వం
X

Working Days: వారానికి 4 రోజులే ప‌ని దినాలు.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న అక్క‌డి ప్ర‌భుత్వం 

Working Days: మ‌ధ్య‌ప్రాచ్యంలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ ప్ర‌భావం ప్ర‌పంచంపై స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీలంక దేశం ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది.

పెరుగుతోన్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్ర‌భావం

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసి వేయ‌డం వల్ల ఆయిల్ రవాణా అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంధనంపై ఆధారపడిన దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.

ఇంధనం ఆదా కోసం శ్రీలంక కీలక నిర్ణయం

ఈ పరిస్థితుల్లో శ్రీలంక ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకూ ఇదే విధానం వ‌ర్తిస్తుంది. ప్రైవేట్ సంస్థలూ ఇదే విధానం పాటించాలని సూచించారు. ప్రతి బుధవారం సెలవుగా ప్రకటించాలని ప్రభుత్వం కోరింది. ఈ చర్య వల్ల ఉద్యోగుల ప్రయాణాలు తగ్గి, ఇంధన వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మళ్లీ ఇంధన రేషన్ విధానం

శ్రీలంకలో ఇప్పటికే ఇంధన రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ప్రతి వాహనదారునికి వారానికి 15 లీటర్ల పెట్రోల్/డీజిల్ పరిమితి పెట్టారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు 200 లీటర్ల వరకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఇంధన నిల్వలు సుమారు 6 వారాలు మాత్రమే సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త సరఫరాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

2022 ఆర్థిక సంక్షోభం జ్ఞాపకాలు మళ్లీ

2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో ఇంధనం, ఆహారం, ఔషధాల కొరత ఏర్ప‌డింది. విదేశీ అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ గా మారింది. కాగా ఇప్పుడు దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం IMF నుంచి వచ్చిన సాయంతో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడినా, ఈ సంక్షోభం మళ్లీ ప్రమాదం సృష్టిస్తోంది.

దక్షిణాసియా దేశాలపై కూడా ప్రభావం

ఈ సమస్య కేవలం శ్రీలంకకే పరిమితం కాలేదు. ఇతర దేశాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ ఇంధన వినియోగం తగ్గింంచేందుకు రేష‌న్ విధానాన్ని అమ‌లు చేస్తోంది. పాకిస్తాన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులు మొద‌ల‌య్యాయి. ఈ పరిస్థితి మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో ఇంధన ఒత్తిడిని పెంచుతోంది.

Mokshith

Mokshith

Next Story