World Happiness Report 2026: వావ్..మనకంటే పాక్ ప్రజలు సంతోషంగా ఉన్నారట

World Happiness Report 2026: ప్రపంచ సంతోష నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఈ లిస్ట్ లో మన దేశం 116వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ 104వ స్థానంలో ఉంది.

KVD Varma
Published on: 19 March 2026 4:58 PM IST
World Happiness Report 2026: ప్రపంచ సంతోష నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది.
X

World Happiness Report 2026

World Happiness Report 2026: ఐక్యరాజ్యసమితి బుధవారం 'ప్రపంచ సంతోష నివేదిక 2026'ను విడుదల చేసింది. ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. 147 దేశాలలో పాకిస్థాన్ 104వ స్థానంలో ఉండగా, భారతదేశం 116వ స్థానంలో ఉంది. 2025లో భారతదేశం 118వ స్థానంలో ఉండేది. రెండున్నర సంవత్సరాలుగా యుద్ధంలో చిక్కుకున్న ఇజ్రాయెల్, ప్రపంచంలో ఎనిమిదో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది.

జాబితాలో అట్టడుగున సంఘర్షణలు ఉన్న దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అత్యంత తక్కువ సంతోషకరమైన దేశంగా నిలిచింది, దాని తర్వాత సియెర్రా లియోన్ మరియు మలావి ఉన్నాయి. ఈసారి కూడా మొదటి 10 స్థానాలలో ఆంగ్లం మాట్లాడే దేశం ఏదీ లేదు. యునైటెడ్ స్టేట్స్ 23వ స్థానంలో, కెనడా 25వ స్థానంలో మరియు యునైటెడ్ కింగ్‌డమ్ 29వ స్థానంలో ఉన్నాయి.

ఫిన్లాండ్ వంటి దేశాల సంతోషానికి మంచి ఆర్థిక పరిస్థితులు, వనరుల సమాన పంపిణీ, పటిష్టమైన సంక్షేమ వ్యవస్థలు, మెరుగైన జీవన ప్రమాణాలు కారణమని ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సోషల్ మీడియాను అత్యధికంగా వాడుతుడడం యువతను సంతోషానికి దూరం చేస్తోందని, వారి మానసిక శ్రేయస్సుపైప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని ఈ రిపోర్టు పేర్కొంది.

సంతోషంగా ఉన్న టాప్ 10 దేశాలు ఇవే..

1. ఫిన్లాండ్

2. ఐస్లాండ్

3. డెన్మార్క్

4. కోస్టా రికా

5. స్వీడన్

6. నార్వే

7. నెదర్లాండ్స్

8. ఇజ్రాయెల్

9. లక్సెంబర్గ్

10. స్విట్జర్లాండ్

లిస్టులో చిట్ట చివర నిలిచిన 10 దేశాలు ఇవే..

ఆఫ్ఘనిస్తాన్ (145)

సియెర్రా లియోన్(146)

మలావి(145)

జింబాబ్వే(144)

బోట్స్వానా(143)

యెమెన్(142)

లెబనాన్(141)

డిఆర్ కాంగో(140)

ఈజిప్ట్(139)

టాంజానియా(138)

సోషల్ మీడియా వాడకమే . .

గ్యాలప్ - ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్‌ భాగస్వామ్యంతో 140 దేశాల్లోని సుమారు లక్ష మంది నుండి సేకరించిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు రూపందించారు. పాల్గొన్నవారిని వారి జీవితాలను 0 నుండి 10 స్కేల్‌పై రేట్ చేయమని అడిగారు.

ఆంగ్లం మాట్లాడే - పశ్చిమ ఐరోపా దేశాలలో 25 ఏళ్లలోపు వారిలో, గత దశాబ్దంలో సగటు జీవిత సంతృప్తి స్కోర్లు దాదాపు ఒక పాయింట్ తగ్గాయి. సోషల్ మీడియాను అధికంగా వాడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం ముఖ్యంగా కౌమార బాలికలలో స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. ఆ రిపోర్టు ప్రకారం సోషల్ మీడియాలో రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ గంటలు గడిపే 15 ఏళ్ల బాలికలు, దానిని తక్కువగా ఉపయోగించే వారితో పోలిస్తే గణనీయంగా తక్కువ జీవిత సంతృప్తిని కలిగి ఉన్నట్లు తేలింది.

సోషల్ మీడియాపై రోజుకు గంట కంటే తక్కువ సమయం గడిపే యువత, దానిని అస్సలు ఉపయోగించని వారి కంటే కూడా అత్యధిక స్థాయిలో శ్రేయస్సును కలిగి ఉన్నట్లు నివేదిస్తున్నారు. అయితే, ఇప్పుడు కౌమారదశలో ఉన్నవారు ఈ ప్లాట్‌ఫారమ్‌లపై రోజుకు సగటున సుమారు 2.5 గంటలు గడుపుతున్నారు.

KVD Varma

KVD Varma

Next Story