Mehdipatnam: చిన్నపాటి గొడవకు బాలుడి హత్య.. మెహదీపట్నం పరిధిలో కలకలం రేపిన ఘటన

Mehdipatnam: హైదరాబాద్ టోలిచౌకిలోని జ్యూస్ సెంటర్‌లో దారుణం. చిన్నపాటి గొడవతో సహోద్యోగిని గరిటెతో కొట్టి చంపిన యువకుడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 1:25 PM IST
Mehdipatnam
X

Mehdipatnam: చిన్నపాటి గొడవకు బాలుడి హత్య.. మెహదీపట్నం పరిధిలో కలకలం రేపిన ఘటన

Hyderabad: మైదిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకి లో ఉన్న నైస్ జ్యూస్ సెంటర్లో పనిచేసే ఇద్దరు మధ్య గొడవ బాలుడి హత్యకు దారి తీసింది. జ్యూస్ సెంటర్లో పనిచేసే మోఫిల్ (19), దుర్వేశ్ (16) మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్న విషయమై గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన మోఫిల్ జ్యూస్ సెంటర్లోని ఒక గరిటె తీసుకొని దుర్వేశ్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో దుర్వేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దుర్వేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story