Nellore: చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం.. నెల్లూరు టీడీపీ కార్యాలయం వద్ద దీపాల పండుగ!

Nellore: అమరావతి రాజధానికి పార్లమెంట్ రక్షణ కల్పించడంపై నెల్లూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంబరాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 9:38 AM IST
Nellore
X

Nellore: చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం.. నెల్లూరు టీడీపీ కార్యాలయం వద్ద దీపాల పండుగ!

Nellore: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర కార్యాలయం వద్ద పార్లమెంటు ఉభయసభల్లో ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక అమరావతి రాజధాని బిల్లు ఆమోదించిన సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మరియు నాయకులతో కలిసి క్యాండిల్స్ వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దేశం మొత్తం మద్దతు తెలిపిందని చెప్పారు.. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్ణయించిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి అనేక అడ్డంకులు సృష్టించి అమరావతి రాజధాని నిర్మాణాన్ని అపేసిందని తెలిపారు.

ఎవరు అధికారంలోకి వచ్చినా మరలా అమరావతి రాజధాని మార్పు చేయకుండా ఉండే దానికోసంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సంప్రదించి అమరావతి కి రాజధాని భద్రత కల్పిస్తూ.. సభల్లో ఈరోజు ఆమోద పొందడం సంతోషకరం సందర్భంగా మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story