Nellore: ముఖ్యమంత్రి పర్యటనలో స్వల్ప మార్పులు.. మంత్రి నారాయణ వెల్లడి!
Nellore: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో మార్పులు జరిగాయి. ఈనెల 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీ.
Nellore: ముఖ్యమంత్రి పర్యటనలో స్వల్ప మార్పులు.. మంత్రి నారాయణ వెల్లడి!
Nellore: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈనెల 30న ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ముందుగా జిల్లా యంత్రాంగానికి సమాచారం వచ్చింది. ఆమేరకు జిల్లా యంత్రాంగం, వింజమూరు కేంద్రంగా ఏర్పాట్లను చేపట్టింది. జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్, జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేజెండ్ల, రెండు రోజులుగా ఆ ప్రాంతంలో మకాం వేసి ఏర్పాట్లు చేపట్టారు. ఇదే సమయంలో ఇవాళ సీఎం పర్యటనలో మార్పులు చేస్తూ జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. ఈనెల 30 న నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట కు ముఖ్యమంత్రి రానున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, నివాస సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాటు చేస్తున్నారు.




