Godavari: బాసర టు భద్రాద్రి.. గోదావరి తీరం ఇక కొత్త కళను సంతరించుకోనుంది!
Godavari: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. బాసర నుంచి భద్రాద్రి వరకు ఘాట్ల అభివృద్ధి, ఆలయాల విస్తరణపై అధికారులకు కీలక ఆదేశాలు.
Godavari: బాసర టు భద్రాద్రి.. గోదావరి తీరం ఇక కొత్త కళను సంతరించుకోనుంది!
Godavari: గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. పుష్కాల ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాద్రి వరకు ఆలయాలు, ఘాట్లు అభివృద్ధిపై చర్చించారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల ప్రణాళికలపై రేవంత్‌కు అధికారులు వివరించారు. టెక్నికల్ ఇంజనీర్ల కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు.
కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. పూర్తి నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలిని సూచించారు. ప్రాధాన్యతల వారిగా శాశ్వత తాత్కాలిక పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయాలు పర్యాటక ప్రాంతాల్లో ఘాట్లు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్లు, కనెక్టివిటీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాసర ఆలయా అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌పైనా సమీక్షించి.. ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు.




