Sircilla: కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!
Sircilla: గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన నిమ్మల తిరుపతి గౌడ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేశారు.
Sircilla: కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!
సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన నిమ్మల తిరుపతి గౌడ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని మండలంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఎలుక రాజు, మండల నాయకుడు గుండెల్లి రాజు, నర్మాల గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఓరుగంటి నర్సింలు మాట్లాడుతూ, నిమ్మల తిరుపతి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పని చేయలేదని ఆరోపించారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేదని, గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించారని వారు ఆరోపించారు.
పైరవీ ద్వారా మండల అధ్యక్ష పదవిని పొందారని, ఆయన ఆ పదవికి అనర్హుడని పేర్కొంటూ వెంటనే తొలగించి పార్టీ కోసం పనిచేసే సమర్థ నాయకుడికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు.
తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు సయ్యద్ నుస్రతుల్లా హుస్సేనీ, అజ్మీరా భాస్కర్, సంతోష్ గౌడ్, పద్మ రెడ్డి, గోపాల్, లచ్చయ్య, అజం, గండ్యాదపు శంకర్, ఎగరండి మహేష్ తదితరులు పాల్గొన్నారు.




