Karimnagar: భక్తుల జనసందోహం.. రథోత్సవ వైభవం! ఇల్లందకుంటలో ఈటల పూజలు

Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 1:14 PM IST
Karimnagar
X

Karimnagar: భక్తుల జనసందోహం.. రథోత్సవ వైభవం! ఇల్లందకుంటలో ఈటల పూజలు

కరీంనగర్ జిల్లా: ఇల్లందకుంట మండలకేంద్రంలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం పై కొలువుదీరిన సీతారామచంద్రస్వామి దర్శించుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వందల సంవత్సరాల క్రితమే దేవుడు నడయాడిన ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రం ఉండడం సంతోషం ఈరోజు రథోత్సవం పై కొలువుదీరిన స్వామివారిని వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.గ్రామస్తుల దాతల సహకారంతో పెద్ద ఎత్తున రథాన్ని ఏర్పాటు చేసుకున్నారు కార్యకర్తలంతో నినాదాలు చేసుకుంటూ జైశ్రీరామ్ రథం వైపు నడుచుకుంటూ స్వామి వారి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు స్వాగతం పలికి వారికి తీర్థ ప్రసాదించారు ఆలయ కమిటీ వారిని సన్మానించారు రథోత్సవానికి కోట్లాది రూపాయలతో ఆలయ ప్రాంగణం నిర్మాణాలు చేపట్టడం జరిగింది.ఈ ఆలయం చుట్టూ ప్రాంతాల ప్రజలు అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి పెళ్లిళ్ల కోసం రెండు పెద్ద షెడ్ల నిర్మాణాలను చేపట్టడం జరిగింది నా హయాంలో కొంత సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది రానున్న కాలంలో మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కమిటీని అధికారులను కోరుతున్న రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఈ రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story