Jagtial: కిక్కిరిసిన కొండగట్టు క్యూలైన్లు.. ముగిసిన చిన్న జయంతి వేడుకలు!

Jagtial: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామి చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 10:13 AM IST
Jagtial
X

Jagtial: కిక్కిరిసిన కొండగట్టు క్యూలైన్లు.. ముగిసిన చిన్న జయంతి వేడుకలు!

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం కొండగట్టు అంజన్న స్వామి దేవస్థానంలో ఈనెల ఒకటి నుండి నిర్వహించిన చిన్న జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకలు చివరి రోజున మరింత ఉత్సాహంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడ్డారు.

చివరి రోజు సందర్భంగా దేవస్థానంలో మాల విరమణ చేస్తున్నారు ప్రాంగణం మొత్తం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. "జై శ్రీరాం", "జై హనుమాన్" నినాదాలతో ఆలయ ప్రాంతం మార్మోగింది. భక్తులు తులసి మాలలు, కొబ్బరికాయలు సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు.

దేవస్థానం అధికారులు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. నీరు, అన్నదానం, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story