Kurnool: పాత కక్షలా? మహిళ పట్ల అనుచిత ప్రవర్తనా? హత్య వెనుక అసలు కథ!

Kurnool: కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం కె.శింగవరంలో పాత కక్షల నేపథ్యంలో మల్లేష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 3:57 PM IST
Kurnool
X

Kurnool: పాత కక్షలా? మహిళ పట్ల అనుచిత ప్రవర్తనా? హత్య వెనుక అసలు కథ!

Kurnool: కర్నూలు జిల్లా సి.బెళగల్ (మం) కె.శింగవరంలో దారుణ హత్య జరిగింది. మల్లేష్ అనే యువకుడిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా నరికారు.వేటకొడవళ్లతో కుడికాలుపై నరుకగా. దాని ధాటికి మోకాలు వరకు తెగిపడింది. తీవ్ర రక్తస్రావం జరుగడంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

నాగప్ప , వెంకట్రాముడు మద్య చెలరేగిన పాత కక్షలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన మల్లేష్ ..వెంకట్రాముడి కుమారుడు కావడంతో, గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఒక మహిళ పట్ల నాగప్ప అనుచిత ప్రవర్తన కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. సీన్ ఆఫ్ అఫెన్స్ పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story