Mallapur: మల్లాపూర్‌లో గ్యాస్ కష్టాలు ఏజెన్సీ ముందు వినియోగదారుల బారులు!
Mallapur: మల్లాపూర్ మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Mallapur: మల్లాపూర్‌లో గ్యాస్ కష్టాలు ఏజెన్సీ ముందు వినియోగదారుల బారులు!
మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్ల కొరతతో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముందు వినియోగదారులు బారులు తీరారు. 45 రోజులు గడిచినా బుకింగ్ చేసిన సిలిండర్లు డెలివరీ చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. సమయానికి సిలిండర్లు ఇవ్వకపోతే వంట ఎలా చేసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బుకింగ్ చేసిన సిలిండర్ డెలివరీ అయినట్టు మెసేజ్ వస్తుందని, మళ్ళీ బుకింగ్ అయినట్టు కూడా మెసేజ్ వచ్చిందని దీని గురించి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళను అడిగితే అది డెలివరీ బాయ్ మిస్టేక్ అని దాటవేస్తున్నారని వినియోగదారులు వాపోయారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని,పెండింగ్‌లో ఉన్న సిలిండర్లను తక్షణమే సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.




