Srikakulam: పూలే బాటలో పయనిద్దాం.. నివాళ్లర్పించిన ఎమ్మెల్యే అశోక్!

Srikakulam: కవిటి మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తన క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళ్లర్పించారు.

G.RAMBABU, SOMPET
Published on: 12 April 2026 9:30 AM IST
Srikakulam
X

Srikakulam: పూలే బాటలో పయనిద్దాం.. నివాళ్లర్పించిన ఎమ్మెల్యే అశోక్!

Srikakulam: చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న ఎమ్మెల్యే అశోక్ జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. కవిటి మండలంలోని రామయ్య పుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. అదే విధంగా కవిటి కళ్యాణి ఆంగ్ల పాఠశాల, పెద్ద కర్రివానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఎం. మురళీ ప్రకాష్ మాట్లాడుతూ భారతదేశ ప్రథమ సామాజిక తత్వవేత్త, సత్యశోధకుడు, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు, భారతదేశంలో మహిళ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావుపూలే అని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పొందల కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, బెందాళం విజయకృష్ణ పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story