Bhimavaram: భీమవరంలో చల్లని కబురు.. బాటసారుల కోసం మజ్జిగ చలివేంద్రం!

Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వీరమ్మ పార్క్ వద్ద గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 13 April 2026 2:04 PM IST
Bhimavaram
X

Bhimavaram: భీమవరంలో చల్లని కబురు.. బాటసారుల కోసం మజ్జిగ చలివేంద్రం!

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం: వేసవిలో ప్రయాణికులకు దాహం తీర్చడం కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ వద్ద గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.

గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఇల్లా రాధా, అధ్యక్ష, కార్యదర్శులు పడాల వాసు, కె ఆనంద్ మాట్లాడుతూ మజ్జిగ చలివేంద్రాన్ని గత 20 ఏళ్ల నుంచి దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని, 75 రోజులపాటు ఈ చలివేంద్రం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ భాస్కరరావు, ట్రెజరర్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ కెవి రమణ, ముఖ్య కార్యవర్గ సభ్యులు సామన సత్తిబాబు, మాదాసు బాబి, మాదాసు సాయి, రామాయణం శివ బాబు, రామాయణం చిన్నారి, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, భీమేశ్వర స్వామి దేవస్థానం, దాసాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్లు గని రెడ్డి త్రినాథ్, దారపురెడ్డి త్రివిక్రమ్, మాజీ కౌన్సిలర్లు ఎండి నౌషాద్, మాగాపు ప్రసాద్, సూరిబాబు, కె నరేంద్ర, అరవ నాగేశ్వరరావు, రావూరి అనంత్, మాగాపు భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story