Nellore: "కారుణ్య నియామకంలో విధుల కేటాయింపు" నగర కమిషనర్ వై.ఓ.నందన్
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థలో కారుణ్య నియామకాల ప్రక్రియను కమిషనర్ వై.ఓ. నందన్ పూర్తి చేశారు.
Nellore: "కారుణ్య నియామకంలో విధుల కేటాయింపు" నగర కమిషనర్ వై.ఓ.నందన్
Nellore: నెల్లూరు నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ వర్కర్ లుగా విధులను నిర్వహిస్తూ మరణించిన టి.నరసింహులు, టి.చెంచయ్య, బి.వెంకట రమణయ్య ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కారుణ్య నియామకం ద్వారా వారి వారసులు టి.రవికుమార్, టి.విజయమ్మ, బి.శ్రీనివాసులు లకు పబ్లిక్ హెల్త్ వర్కర్ లుగా విధులను కేటాయిస్తూ కమిషనర్ వై.ఓ నందన్ ఉత్తర్వులను జారీ చేశారు.
కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం కారుణ్య నియామకం పత్రాలను వారు కమిషనర్ నుంచి అందుకున్నారు. విధుల నిర్వహణలో క్రమశిక్షణ ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కమిషనర్ వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్, సూపరింటెండెంట్ సులోచన, గుమస్తా అశ్వని లు పాల్గొన్నారు.




