Nellore: ప్రమాదాల నివారణకు ఎస్పీ అజిత వేజెండ్ల మాస్టర్ ప్లాన్
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు నెల్లూరు పోలీసుల వినూత్న చర్యలు.
Nellore: ప్రమాదాల నివారణకు ఎస్పీ అజిత వేజెండ్ల మాస్టర్ ప్లాన్
నెల్లూరు జిల్లా: యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు పోలీసులు.
పోలీసు అధికారులు టోల్ ప్లాజాలు, ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద రాత్రిపూట ప్రయాణించే వాహనదారులను ఆపి, డ్రైవర్లకు ముఖం కడిగించి అప్రమత్తం చేస్తున్నారు. నిద్ర మత్తుతో జరిగే ప్రమాదాలను తగ్గించడం మరియు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
డ్రైవర్లు నిద్రగా అనిపిస్తే వాహనం ఆపి విశ్రాంతి తీసుకోవాలి, వేగ పరిమితులు పాటించాలి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని పోలీసులు సూచించారు. అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రాణం కంటే విలువైనది ఏమీ లేదని అవగాహన కల్పిస్తున్నారు.
మనకోసం ఎదురు చూసే కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారని, మనం బాధ్యత కలిగి నడుచుకోవాలని సూచించారు నెల్లూరు నగర పోలీసులు...
అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం కోసం 112 కు సంప్రదించాలని కోరారు.


