Nizamabad: పెళ్లి పీటల నుంచి స్మశాన వాటికకు.. ఆర్మూర్‌లో తీవ్ర విషాదం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో విషాదం. వివాహమైన నెలరోజులకే కల్లేడి గ్రామంలో నవవధువు అఖిల ఆత్మహత్య.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 6:30 AM IST
Nizamabad
X

Nizamabad: పెళ్లి పీటల నుంచి స్మశాన వాటికకు.. ఆర్మూర్‌లో తీవ్ర విషాదం!

Nizamabad: ఆర్మూర్ ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. బాన్సువాడకు చెందిన అఖిలకు, కల్లేడి గ్రామానికి చెందిన శ్రీకాంత్తో గత మార్చి 5న వివాహం జరిగింది. శుక్రవారం పుట్టింటి నుంచి అత్తగారింటికి చేరుకున్న అఖిల, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story