Khammam: కళ్యాణ లక్ష్మి కానుక.. సత్తుపల్లి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే!

Khammam: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు CMRF చెక్కుల పంపిణీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 9:17 AM IST
Khammam
X

Khammam: కళ్యాణ లక్ష్మి కానుక.. సత్తుపల్లి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే!

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు యస్సీ -25,యస్టీ- 10 , బిసీ- 9, ఎస్ ఎం-4, ఇబిసి- 8, సత్తుపల్లి పట్టణం -19 చెక్కులు, రూరల్ -37 చెక్కులు మొత్తం- 56 మంది లబ్ధిదారులకు 56,06,496 రూపాయలు నగదు చెక్కులు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందించారు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.సత్తుపల్లి మండలానికి చెందిన సియంఆర్ ఎఫ్ చెక్కులు సత్తుపల్లి మండలం(గ్రామీణం) -36 మంది లబ్ధిదారులు 11,72,500 రూపాయలు చెక్కులు మరియు సత్తుపల్లి పట్టణం -29 మంది లబ్ధిదారులు 8,71,500 రూపాయలు మొత్తం- 20,44,00 రూపాయలు విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించారు.ఈ కార్యక్రమం లో యంఆర్ ఓ, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహాన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు,సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం లోని గ్రామాల సర్పంచ్ లు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, దొడ్డాశ్రీను మరియు గ్రామాల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story