Kurnool: విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే.. మధ్యాహ్న భోజన పథకం తనిఖీ
Kurnool: ఓర్వకల్లు మండలంలోని సోమయాజులపల్లె పాఠశాలలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సందర్శన. మధ్యాహ్న భోజన పథకం పరిశీలనలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే.
Kurnool: విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే.. మధ్యాహ్న భోజన పథకం తనిఖీ
Kurnool: ఓర్వకల్ మండల పరిధిలోని సోమయాజులపల్లె గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల (హైస్కూల్)ను ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు.
విద్యార్థులతో మమేకమై భోజనం చేసిన ఎమ్మెల్యే, వారికి అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, వంట విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలల్లో పరిశుభ్రత పాటిస్తూ, మెనూ ప్రకారం ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
Next Story


