Pathapatnam: పాతపట్నంలో పోలీస్ యాక్ట్ అమల్లోకి.. ఏప్రిల్ నెలంతా నిఘా నీడలోనే!

Pathapatnam: పాతపట్నం నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 30 వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 31లు అమలు చేస్తున్నట్లు సీఐ ఎన్. సన్యాసినాయుడు ప్రకటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 April 2026 1:01 PM IST
Pathapatnam
X

Pathapatnam: పాతపట్నంలో పోలీస్ యాక్ట్ అమల్లోకి.. ఏప్రిల్ నెలంతా నిఘా నీడలోనే!

పాతపట్నం: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టెక్కలి సబ్ డివిజన్ పరిధిలో ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 30, 31లను అమలు చేస్తున్నట్లు పాతపట్నం సీఐ ఎన్ సన్యాసినాయుడు మీడియా కు తెలిపారు. డిఎస్పీ వారి ఉత్తర్వుల మేరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. డీఎస్పీ ముందస్తు అనుమతి లేకుండా నియోజకవర్గ పరిధిలో ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు లేదా నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని సూచించారు. నలుగురు అంతకంటే ఎక్కువ మంది సమావేశాలు కాకూడదని ఆంక్షలు విధించారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఏపీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 31 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాతపట్నం పోలీస్ సర్కిల్ పరిధిలోని ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పోలీసు వారికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story