RTC: చర్చలు వాయిదా.. సమ్మెకు సై.. ఆర్టీసీ కార్మికుల నెక్స్ట్ మూవ్ ఏంటి?
RTC: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ అత్యవసర సమావేశం. లేబర్ కమిషనర్ చర్చలు వాయిదా పడటంతో సమ్మె దిశగా కార్మిక సంఘాలు అడుగులు.
RTC: చర్చలు వాయిదా.. సమ్మెకు సై.. ఆర్టీసీ కార్మికుల నెక్స్ట్ మూవ్ ఏంటి?
Hyderabad: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సమావేశం కానుంది. అయితే.. ఈరోజు ఆర్టీసీ కార్మికులతో లేబర్ కమిషనర్ చర్చలు వాయిదా పడింది. దీంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతోంది ఆర్టీసీ జేఏసీ. ఇదిలా ఉంటే.. ప్రభుత్వంలో విలీనంపై స్పష్టత ఇవ్వకపోతే కచ్చితంగా సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈరోజు భేటీ తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ వెల్లడించింది.
Next Story




