Vikarabad: తాండూరులో వీర హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా శోభాయాత్ర!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకుని వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Vikarabad: తాండూరులో వీర హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా శోభాయాత్ర!
వికారాబాద్ జిల్లా తాండూరు: తాండూరులో కన్నుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర, హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా తాండూరు పట్టణంలో హనుమాన్ శోభాయాత్రను హిందూ సంఘాలు, స్టేషన్ హనుమాన్ భజనమండలి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగవైభవంగా జరిగింది. పట్టణంలోని స్టేషన్ హానుమాన్ మందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభయి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్ర ప్రారంభంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ, బీఆర్ఎస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా అడిషనల్ ఎస్పీ బిఆర్ నాయక్, తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story




