Siddipet: సబ్సిడీపై రోటవేటర్లు.. అన్నదాతల ముఖంలో చిరునవ్వు

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుటలో 10 మంది రైతులకు రూ. 13 లక్షల విలువైన రోటవేటర్లను సబ్సిడీపై పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 4:44 PM IST
Siddipet
X

Siddipet: సబ్సిడీపై రోటవేటర్లు.. అన్నదాతల ముఖంలో చిరునవ్వు

సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మండలానికి సంబంధించిన 10 మంది రైతులకు సబ్సిడీపై 13 లక్షల 727 రూపాయల విలువైన 10 రోటవేటర్ లు ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి గారితో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి* పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల పై ఎటువంటి సబ్సిడీలు ఇవ్వలేదన్నారు.

ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని అన్నారు.ఈ రోజు మన దుబ్బాక నియోజకవర్గానికి 54లక్షల రూపాయల వ్యవసాయ సబ్సిడీ పనిముట్లు వచ్చాయని వచ్చే ఆర్థిక సంవత్సరంలో మండలానికి 50 లక్షల రూపాయల వ్యవసాయ సబ్సిడీ పనిముట్లు వస్తాయని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో AO మోహన్, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, మార్కెట్ వైస్ చైర్మన్ కొంగరి నర్సింలు, సర్పంచ్ లు పాగాల శోభ కొండల్ రెడ్డి,గొడుగు జయమ్మ నర్సింలు, డైరెక్టర్ లు చందా సత్తయ్య ,తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story