Nellore: పొగాకు రైతుకు తప్పని తిప్పలు ఆశించిన ధర రాక నిరాశ!

Nellore: నెల్లూరు జిల్లా డి.సి. పల్లి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభం. తొలి రోజు కిలో రూ. 250 ధర పలకడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 3:30 PM IST
Nellore
X

Nellore: పొగాకు రైతుకు తప్పని తిప్పలు ఆశించిన ధర రాక నిరాశ!

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోలను వేలం నిర్వ హణ అధికారి జి సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రోజు 18 పొగాకు బెళ్లను రైతులు తీసుకురాగా 18 పొగాకు బెళ్లను బయ్యర్లు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. కిలో గరిష్ట, కనిష్ట ధర 250 రూపాయలు పలికినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేలంలో మొత్తం 8 కంపెనీల బయ్యర్లు పాల్గొన్నట్లు వెల్లడించారు. పొగాకు క్వాలిటీ గా ఉన్నప్పటికీ కిలో 250 రూపాయలు ధర పలకడంపై రైతులు నిరాశ వ్యక్తం చేశారు. గత సంవత్సరం కిలో పొగాకు ధర 280 వరకు పలకగా ఈసారి ప్రారంభంలోనే కిలో 250 పలకడం రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ సంవత్సరం పెరిగిన పెట్టుబడుల దృశ్య కనీస మద్దతు ధర కిలో 300 రూపాయలు పలికితే గాని రైతులకు బిట్టుబాటు కాదని రైతు సంఘ నాయకులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story