Srinivasa Varma: ఆకివీడు బాధితులకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరామర్శ
Srinivasa Varma: ఆకివీడు ఘర్షణలో గాయపడిన బాధితులను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ భీమవరం ఆసుపత్రిలో పరామర్శించారు.
Srinivasa Varma: ఆకివీడు బాధితులకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరామర్శ
Srinivasa Varma: ఆకివీడు ఘర్షణలో గాయపడి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పరామర్శించారు.శుక్రవారం ఆకివీడు ఘటన లో గాయపడిన గవర అనిల్ కుమార్, వెజ్జు నాగ సాయిలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, జనసేన నాయకులు చలమలశెట్టి చంద్రశేఖర్, బండి రమేష్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, లీలా కృష్ణ, షేక్ మొహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




