Korapalli: జబ్బుపై అవగాహన.. ఆరోగ్యంపై నిఘా!

Korapalli: కోరపల్లి గ్రామ పంచాయతీలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 5:03 PM IST
Korapalli
X

Korapalli: జబ్బుపై అవగాహన.. ఆరోగ్యంపై నిఘా!

Korapalli: ఈరోజు కోరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో క్షయవాది ప్రపంచ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ కందికట్ల మధుసూదన్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్మూలన ప్రాజెక్టు సూపర్వైజర్ మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ డైరెక్టర్,తిరుపతి,ఉప సర్పంచ్ బక్కతట్ల రాజు, పాలకవర్గం,అలాగే ఆశా వర్కర్స్, ఏఎన్ఎం,లు ప్రజలు,భాగస్వాములై నివారణ ధ్యేయంగా క్షయ వాది నిర్మూలనలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్ రెడ్డి సర్పంచ్ మధుసూదన్ మాట్లాడుతూ చేయవాదిని ముందే గుర్తించి సకాలంలో మందులు కనుక వాడినట్లయితే నివారించవచ్చు లేనట్టయితే ఇది బ్యాక్టీరియా ద్వారా ఇతరులకు వ్యాధి సోకే అవకాశం ఉంది వ్యాధి సోకిన వారికి ఫస్ట్ స్టేజిలో మూడు నెలలు రెండవ స్టేజిలో ఆరు నెలలు మూడవ స్టేజిలో 9 నెలలు మందులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క మందులు తీసుకునేటువంటి సమయంలో వ్యాధి గ్రస్తునికి ప్రభుత్వం ద్వారా నెలకు 1000 రూపాయలు పౌష్టిక ఆహారం కోసం ఇవ్వడం కూడా జరుగుతుంది కావున ఇట్టి సౌకర్యాన్ని వ్యాధిగ్రస్తులు గ్రహించగలరని కోరినారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story