Porumamilla: 22 ఏళ్లకే సర్పంచ్ బరిలో.. ఏపీ రాజకీయాల్లో యువ సంచలనం!
Porumamilla: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కేవలం 22 ఏళ్ల యువతి నగిరి శివసాహితీ టీడీపీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు.
Porumamilla: 22 ఏళ్లకే సర్పంచ్ బరిలో.. ఏపీ రాజకీయాల్లో యువ సంచలనం!
Porumamilla: రాష్ట్ర రాజకీయాల్లో యువతరం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం, టేకూరుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కేవలం 22 ఏళ్ల యువకురాలు నగిరి శివసాహితీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
చిన్న వయసులోనే ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వస్తున్న ఆమెకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పూర్తి మద్దతు ప్రకటించింది. శివసాహితీ తండ్రి భైరవ ప్రసాద్ ప్రస్తుతం పోరుమామిళ్ల టీడీపీ మండల అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, ఉన్నత చదువులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై అవగాహన ఉన్న శివసాహితీ పోటీ చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సోమవారం స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలతో కలిసి ఆమె తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్న వేళ, 22 ఏళ్ల యువతి సర్పంచ్ పదవికి పోటీ పడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.




