Proddatur: టీడీపీకి బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన 40 కుటుంబాలు!
Proddatur: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన 40 కుటుంబాలు.
Proddatur: టీడీపీకి బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన 40 కుటుంబాలు!
Proddatur: స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో టీడీపీకి చెందిన సుమారు 40 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. రాయల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో దివంగత మాజీ కౌన్సిలర్ వై.ఎస్. హమీద్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీడీపీని వీడి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలోకి వచ్చిన వారికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఒకేసారి ఇన్ని కుటుంబాలు పార్టీ మారడం స్థానికంగా చర్చనీయాంశమైంది.




