Kadapa: కడపలో 9 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Kadapa: కడపలో అక్రమంగా తరలిస్తున్న 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి.

G. RAVI KUMAR, KADAPA
Published on: 4 Sept 2026 12:27 PM IST
Kadapa
X

Kadapa: కడపలో 9 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

కడప: కడపలో 9 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కడప ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తుండగా తనిఖీలు చేపట్టగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని,

వాహనంలో ప్లాస్టిక్ సంచిలో 9 కిలోల గంజాయిని ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.కిలో రూ.5 వేల చొప్పున 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఒక కిలో విక్రయించి.. మిగిలిన 9 కిలోలను తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.నిందితుడు సతీష్ చంద్రపై గతంలోనూ గంజాయి కేసులు ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన ఇద్దరినీ రిమాండ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story