Rayachoty: రాయచోటి శ్రీ చైతన్య స్కూల్‌పై చర్యలు తీసుకోండి: AISA

Rayachoty: రాయచోటిలో అనుమతుల్లేని శ్రీ చైతన్య స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని AISA నాయకుడు సాయికుమార్ డిమాండ్ చేశారు. DEO పాత్రపై విచారణకు కోరారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 1 Aug 2026 12:35 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటి శ్రీ చైతన్య స్కూల్‌పై చర్యలు తీసుకోండి: AISA

అన్నమయ్య జిల్లా రాయచోటి:

ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ విద్యాసంస్థపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.

అన్నమయ్య జిల్లా రాయచోటి లో

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థ కొలబైలు పంచాయతీ పరిధిలో సుమారు 300–400 మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరమని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ AISA అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లి సాయికుమార్ మాట్లాడుతూ జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం నుండి నేటి వరకు శ్రీ చైతన్య స్కూల్ సంబందించి విద్యార్థుల హాజరు వివరాలు UDISEలో నమోదు కాలేదని అన్నారు. ప్రతి విద్యార్థి హాజరు నమోదు అత్యంత కీలకమైన అంశం. హాజరు నమోదు లేకపోతే విద్యార్థుల విద్యా రికార్డులు, తదుపరి తరగతులకు ప్రమోషన్, ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హత వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నకు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు.

విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర పేర్లతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా అమలవుతున్నాయా లేదా అనే అంశంపై జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.

కలికిరిలోని తపస్యా స్కూల్, విజయవాణి స్కూల్ తదితర విద్యాసంస్థల్లో కూడా UDISE నమోదు, ప్రభుత్వ అనుమతులు మరియు ఇతర నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరపాలని AISA డిమాండ్ చేసింది.

ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి డా. కే. సుబ్రమణ్యం గారి పాత్ర చాలా కీలకంగా ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. Deo బాధ్యతలపై ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరిపి, అవసరమైతే విధుల నుంచి తప్పించి నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా AISA ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎ నాయకులు పవన్, విజయ్, శివతేజ పాల్గొన్నారు

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story