Rayachoti: రాయచోటిలో ఏజే బ్యూటీ లాంజ్‌ను ప్రారంభించిన టీడీపీ అధ్యక్షుడు!
Rayachoti: రాయచోటి కొత్తపేట రోడ్డులో వైభవంగా ప్రారంభమైన ఏజే బ్యూటీ లాంజ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు.
Rayachoti: రాయచోటిలో ఏజే బ్యూటీ లాంజ్‌ను ప్రారంభించిన టీడీపీ అధ్యక్షుడు!
Rayachoti: రాయచోటి పట్టణం కొత్తపేట రోడ్డులో యాజమాన్యం పుష్పావతి గారి ఆహ్వానం మేరకు సోమవారం ఉదయం AJ బ్యూటీ లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు రిబ్బన్ కట్ చేసి AJ బ్యూటీ లాంజ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని, నిర్వాహకులకు మంచి పేరు, అభివృద్ధి, సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
కొత్తగా ప్రారంభించిన ఈ బ్యూటీ లాంజ్ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందాలని, మరింత అభివృద్ధి సాధించాలని ప్రసాద్ బాబు గారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా AJ బ్యూటీ లాంజ్ నిర్వాహకులు సుగవాసి ప్రసాద్ బాబు గారికి ఘజమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆత్మీయంగా అభినందనలు తెలియజేశారు.




