Porumamilla: పోరుమామిళ్ల జగనన్న కాలనీలో మౌలిక వసతుల కొరత!
Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల జగనన్న కాలనీలో తాగునీరు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Porumamilla: పోరుమామిళ్ల జగనన్న కాలనీలో మౌలిక వసతుల కొరత!
Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల కాల్వకట్ట ప్రాంతంలోని జగనన్న కాలనీని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు సందర్శించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సుమారు 70 నుంచి 80 ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 12 కుటుంబాలు మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.
కాలనీకి సరఫరా అవుతున్న నీటిని పక్కనే ఉన్న రాజీవ్ నగర్‌కు చెందిన కొందరు వాల్ తిప్పడంతో తమకు నీరు అందడం లేదని స్థానికులు ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
అదేవిధంగా కాలనీలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో తేళ్లు, పాములు, ఇతర కీటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్లే చాలామంది లబ్ధిదారులు కాలనీలోకి వచ్చి నివాసం ఉండలేకపోతున్నారని స్థానికులు తెలిపారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు కాలనీలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాలని కోరారు. ముఖ్యంగా తాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రజలు సురక్షితంగా నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కాలనీకి నిరంతర నీటి సరఫరా అందించడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేసి, మిగిలిన అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సెక్రటరీ ఫణి రావు, ఆఫీస్ సెక్రటరీ కె. ప్రవీణ్ బాబు, ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీను కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.




