Annamayya: అన్నమయ్య జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి!

Annamayya: అన్నమయ్య జిల్లాలో పునరుద్ధరించని 17 మద్యం దుకాణాలకు గాను 13 షాపులకు లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించగా, రూ.2.34 కోట్ల ఆదాయం సమకూరింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Oct 2026 3:16 PM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి!

Annamayya: అన్నమయ్య జిల్లాలో పునరుద్ధరణకు నోచుకోని 17 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, 13 దుకాణాలకు 78 దరఖాస్తులు వచ్చాయి. గురువారం మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ నిర్వహించి లైసెన్సుదారులను ఎంపిక చేశారు.

ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున 78 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2.34 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. లాటరీలో ఎంపికైన వారు నిబంధనల ప్రకారం పన్నులు, రుసుములు చెల్లించిన అనంతరం లైసెన్సులు జారీ చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు రాని మిగిలిన నాలుగు దుకాణాలకు త్వరలో మరో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI