Galiveedu: గాలివీడు జెడ్పీటీసీపై ఉత్కంఠ: టీడీపీ నేతల పోటాపోటీ!
Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడు జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ నేతలు సుగవాసి ప్రసాద్ బాబు, గడికోట ద్వారకనాథరెడ్డి పోటీపడటంతో బి-ఫామ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Galiveedu: గాలివీడు జెడ్పీటీసీపై ఉత్కంఠ: టీడీపీ నేతల పోటాపోటీ!
గాలివీడు: రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు జడ్పీటీసీ స్థానానికి గురువారం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు నామినేషన్ దాఖలు చేయగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అన్నమయ్య జెడ్పి చైర్మన్ ఓసి జనరల్ కు రావడంతో టీడీపీ అధిష్టానం ఛైర్మెన్ పదవి ఎవరికి ప్రకటించకపోవడంతో ఒకే స్థానానికి ఇద్దరు హేమాహెమీలు పోటీబడ్డారు దీంతో గాలివీడు రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీ అధిష్టానం బి ఫామ్ ఎవరికీ దక్కుతుందో దానిపై ఉత్కంఠ నెలకొంది.




