Madanapalle: చైత్ర బిల్డర్స్ యజమానిపై బాధితులు, సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చైత్ర బిల్డర్స్ యజమాని రవితేజ నాయుడు ఫ్లాట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, వేతనాలు ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు, సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 19 Nov 2026 1:41 PM IST
Madanapalle
X

Madanapalle: చైత్ర బిల్డర్స్ యజమానిపై బాధితులు, సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలోని చైత్ర బిల్డర్స్ యజమాని రవితేజ నాయుడుపై పలువురు బాధితులు, సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫ్లాట్లు ఇస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆరోపించగా, తమకు వేతనాలు చెల్లించకుండా యజమాని మోసం చేశారని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులు, సిబ్బంది కలిసి ఎస్పీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle