Annamayya: జిల్లాలో పోలీసుల 'పల్లె నిద్ర' ప్రశాంత ఎన్నికలే లక్ష్యం!

Annamayya: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసుల 'పల్లె నిద్ర'. సైబర్ నేరాలు, సోషల్ మీడియా పోస్టులపై ప్రజలకు అవగాహన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Aug 2026 11:41 PM IST
Annamayya
X

Annamayya: జిల్లాలో పోలీసుల 'పల్లె నిద్ర' ప్రశాంత ఎన్నికలే లక్ష్యం!

Annamayya: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, గారి ఆదేశాలతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు శనివారం రాత్రి గ్రామాల్లో 'పల్లె నిద్ర' చేపట్టారు.

అధికారులు స్థానిక ప్రజలు, యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల వేళ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పిస్తూ, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి భద్రతకు సహకరించాలని కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story