Rayachoti: జెడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబుకు ద్వారకనాథరెడ్డి అభినందనలు!
Rayachoti: అన్నమయ్య జిల్లా పరిషత్ నూతన చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబును రాయచోటి టీడీపీ కార్యాలయంలో లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Rayachoti: జెడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబుకు ద్వారకనాథరెడ్డి అభినందనలు!
రాయచోటి: శనివారం రోజు రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా పరిషత్ నూతన చైర్మన్, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారిని లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథరెడ్డి గారు, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీ రమేష్ రెడ్డిఫ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు చేపట్టిన సుగవాసి ప్రసాద్ బాబు గారికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాద్ బాబు గారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆత్మీయతతో టీడీపీ కార్యాలయం సందడిగా మారింది. ప్రసాద్ బాబు గారి నాయకత్వంలో అన్నమయ్య జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.




