Sundupalli: సుండుపల్లె వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!
Sundupalli: అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం ఉప్పరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
Sundupalli: సుండుపల్లె వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!
Sundupalli: కడప జిల్లా సుండుపల్లి మండలం ఉప్పరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈరోజు తెల్లవారుజామున చిన్న గొల్లపల్లి కు చెందిన జయరాం (40), రవి (38) సుండుపల్లె లో జరిగే పశువుల సంతకు ఒకే ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఉప్పరపల్లి వద్ద రోడ్డుపై తీవ్ర రక్త మడుగులో విగత జీవులుగా మారారు.
స్థానికులు వెంటనే సుండుపల్లె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని బైక్ అదుపుతప్పి బోల్తా పడిందా ? లేక ఏదైనా వాహనం డి కొట్టిందా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఎస్సై మహేష్ తెలిపారు.
Next Story




