Annamayya: మదనపల్లెలో అక్రమంగా కలప తరలిస్తున్న లారీ సీజ్!

Annamayya: నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి వద్ద అక్రమంగా కలప తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. చెట్లను నరికితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Srinivasulu, Madanapalle
Published on: 9 Aug 2026 9:13 AM IST
Annamayya
X

Annamayya: మదనపల్లెలో అక్రమంగా కలప తరలిస్తున్న లారీ సీజ్!

అన్నమయ్య జిల్లా, మదనపల్లె:

అక్రమంగా కలప తరలిస్తున్న లారీ సీజ్

అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. మదనపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి అనుమతులు లేకుండా హుసైన్ చెట్లను నరికి, వాటిని లారీలో అక్రమంగా తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎఫ్‌బీవో దీప లారీని అడ్డుకుని తనిఖీ చేశారు. లారీకి సంబంధించిన రికార్డులను పరిశీలించగా కలప తరలింపునకు ఎలాంటి అనుమతులు లేనట్లు గుర్తించారు. దీంతో లారీతో పాటు అందులోని కలపను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ సైదులు తెలిపారు. అక్రమంగా చెట్లను నరికివేసి కలపను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story